Bonal Festivals Dates in Telangana : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను విశ్వవ్యాప్తంగా చేసే విధంగా ఆషాడం బోనాలు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశ, విదేశాల్లో సైతం ప్రజలు బోనాలు, బతుకమ్మ వేడుకలను చేసుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో ఆషాడ జాతర జోనాల ఉత్సవాలపై ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. భాగ్యనగర బోనాల వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని అన్నారు. గతంలో రాష్ట్ర పండుగగా గుర్తించాలని అడిగితే పాలకులు పట్టించుకోలేదని.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించారన్నారు.
2023 bonal festival : ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల కేటాయించిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని.. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న పాతబస్తీలో బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపులు నగరమంతా జరుగుతాయన్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు అద్భుతంగా అలంకరించనున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర ఏర్పడిన తరవాత ఘనంగా బోనాలు పండగ : వచ్చే నెల 20 తేదీన బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం జరుగుతుందన్నారు. అధికారులు, ఆలయ నిర్వాకులతో సమావేశం నిర్వహించామని.. అందరిని ఆహ్వానించి బోనాల పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గతం ప్రభుత్వంలో బోనాల నిర్వహణకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతకుమారి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు అతదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
"రాష్ట్రం ఏర్పడిన తరవాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బోనాలు పండగను నిర్వహించనున్నాం. గతంలో రాష్ట్ర పండగగా ప్రకటించాలని చెప్పినా .. ఎవరు చెయ్యలేదు. కేసీఆర్ వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర పండగగా ప్రకటించి.. అనేక సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేశారు. వచ్చే నెల 20 తేదీన బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నాం. ఒకప్పుడు ఇదే పండక్కి చాలా తక్కువ మంది వచ్చేవారు. ఎందుకంటే సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. ప్రస్తుతం దేవాదాయ శాఖలో పరిస్థితులు మారాయి. నిధులు అధికంగా కేటాయిస్తున్నాం." - తలసాని శ్రీనివాస్‌యాదవ్ , రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి
ఇవీ చదవండి: