ETV Bharat / state

'భాజపాకు 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది' - BJP

హైదరాబాద్​ లక్టీకపూల్​లోని ఓ హోటల్​లో భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ మీట్​ ది ప్రెస్​ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమకు 2019 సంవత్సరం దేశవ్యాప్తంగా బాగా కలిసొచ్చిందని స్పష్టం చేశారు.

'2019 is the best year for BJP says laxman
'భాజపాకు 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది'
author img

By

Published : Jan 2, 2020, 2:27 PM IST

కేసీఆర్‌, కేటీఆర్​కి భాజపా భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వారిద్దరికి రాత్రి పూట నిద్రపట్టడం లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు తెలంగాణ రాజకీయాలు ఇంకా ఒంటపట్టలేదని విమర్శించారు. హైదరాబాద్​ లక్డీకపూల్​లో తెలంగాణ జర్నలిస్ట్​ యూనియన్​ ఆధ్వర్యంలో లక్ష్మణ్​ మీట్​ ది ప్రెస్​ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్​ డైరీని ఆయన ఆవిష్కరించారు.

2019 సంవత్సరం దేశవ్యాప్తంగా భాజపాకు కలిసి వచ్చిందని పేర్కొన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో సొంతంగా పూర్తి మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో భాజపా బలపడిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్​ స్థానాలు గెలిచామని... తెరాస అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

గ్లోబరినా సంస్థ నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్​ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించామని వివరించారు. యాదాద్రి దేవాలయంపై బొమ్మలు చెక్కి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని... ఆ బొమ్మలు తీసివేసేంత వరకు భాజపా పెద్ద ఎత్తున ఉద్యమించిందన్నారు.

For All Latest Updates

TAGGED:

BJPlaxman
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.