ETV Bharat / state

ఉపాధి పనుల్లో 20 శాతం మంది వృద్ధులు - telangana updates

రాష్ట్రంలో 81 ఏళ్లు దాటిన దాదాపు 97 వేల మంది ఉపాధి హామీ పనులకు వెళ్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కూలీల్లో 20 శాతానికిపైగా 60 ఏళ్లకు పైబడిన వారున్నారు.

ఉపాధి పనుల్లో 20 శాతం మంది వృద్ధులు
ఉపాధి పనుల్లో 20 శాతం మంది వృద్ధులు
author img

By

Published : Jan 2, 2021, 7:16 AM IST

పేదరికం, పూట గడవని పరిస్థితి తదితర కారణాలతో కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు వృద్ధులూ పలుగు, పార పట్టి పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో 81 ఏళ్లు దాటిన దాదాపు 97 వేల మంది ఉపాధి హామీ పనులకు వెళ్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కూలీల్లో 20 శాతానికిపైగా 60 ఏళ్లకు పైబడిన వారున్నారు.

కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో జనం ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. చాలా మంది పట్టణాలు వదిలి సొంతూళ్లకు వెళ్లిపోయారు. అక్కడ ఉపాధి హామీ పథకంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో 2020-21లో 1.13 లక్షల కుటుంబాలు కొత్తగా ఈ పథకంలోకి వచ్చాయి. ఉపాధి హామీ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి తప్పక 150 రోజుల పని కల్పించాలి.

రాష్ట్రంలో 2020-21లో ఇప్పటి వరకు 150 రోజుల లక్ష్యం పూర్తిచేసుకున్న కుటుంబాలు 682 ఉన్నాయి. మరో 16,788 కుటుంబాలు నూరు రోజుల పని పూర్తిచేసుకున్నాయి. మే నెలలో అత్యధికంగా 29 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ పథకంలో లబ్ధిపొందాయి.

ఇదీ చదవండి : తెగ తాగేశారు: 2020లో మద్యం అమ్మకాల ఆల్​టైమ్ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.