రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ చెప్పారు. కమిషనరేట్ పరిధిలో 43 ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని... అక్కడ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సిబ్బంది ఉంటారన్నారు.
ఇప్పటి వరకు కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనదారులపై 200 కేసులు నమోదు చేశామన్న ఆయన... వారం రోజుల్లో మాస్కులు ధరించని వారిపై 16 వేల కేసులు పెట్టినట్లు తెలిపారు. 90 శాతం దుకాణాలు, బార్లు, మద్యం షాపులు, కార్యాలయాలు రాత్రి 8 గంటలకే మూసివేస్తున్నారన్న సీపీ... పది శాతం మంది మాత్రమే ఒత్తిడి చేసే వరకు మూయడం లేదని అన్నారు. ప్రజలు నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ మహేశ్‌భగవత్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : క్రికెట్ బుకీ అరెస్టు.. 10 లక్షల నగదు, ఫోన్లు స్వాధీనం