16 Members Arrest in Bigg Boss 7 Case : తెలుగు రియాల్టీ షో మంచి ఆదరణ పొందిన బిగ్‌బిస్ షో కేసు తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. సీజన్ 7(Bigg Boss 7 Season) విజేత పల్లవి ప్రశాంత్ కేసు విషయంలో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Pallvi Prasanth Case Update : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో పాల్గొన్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. ఇందులో 12 మంది మేజర్లు భూపతి బాలకృష్ణ, మోహన్ కుమార్ భూపతి రాఘవేందర్, రంజిత్ కుమార్, మొలావల గణేష్, ధర్మపురి రోహిత్, సరళ రాఘవ, సురేందర్, రాపంతు నవీన్, సంతోష్, ఇదుమొళ్ల మహేష్, ధర్మపురి ఏసు రత్నంలను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. మిగిలిన నలుగురు మైనర్లుగా గుర్తించారు. వీరిని జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఎదుట హాజరు పర్చనున్నారు.
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు - 14 రోజుల పాటు రిమాండ్
Bigg Boss 7 Case Update News : బిగ్‌బాస్ సీజన్ 7లో రైతుబిడ్డగా పరిచయమయిన పల్లవి ప్రశాంత్(Pallavi Prasanth) టైటిల్ విజేతగా నిలిచారు. అనంతరం అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకి వచ్చారు. ప్రశాంత్ అభిమానులు ఆనందంతో రెచ్చిపోయారు. దీంతో అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో పలు కార్లు, ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటనపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసినందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Pallavi Prasant Latest News : ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసినందుకు ఆ సంస్థ అధికారులు బిగ్‌బాస్(Bigg Boss)పై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా స్వీకరించి పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం రైతుబిడ్డ పరారీలో అయ్యాడనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో కొంత మంది ప్రేక్షకులు తనపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఏ1గా బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ - దెబ్బకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు!
Pallavi Prasant Case Arrest Members : సామాజిక మాధ్యమంలో ప్రశాంత్‌పై వైరల్ అవుతున్న విషయం తెలుసుకుని ఆ వార్తలపై స్పందించాడు. తాను పరారీలో ఉన్నట్లు వైరల్ అవుతున్న సమాచారంలో నిజంలేదని తేల్చి చెప్పాడు. సిద్ధిపేటలో ఉన్న తన స్వగృహాం దగ్గరే ఉన్నాడని తెలుపుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో చూసిన పోలీసులు బుధవారం తన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవాళ పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు ప్రశాంత్ వేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. దీనిపై నిర్ణయం శుక్రవారం తెలుపుతామని నాంపల్లి కోర్టు తెలిపింది.
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు
బిగ్‌బాస్ 7 విజేత 'రైతుబిడ్డ' కవిత అదుర్స్- రెమ్యునరేషన్+ ప్రైజ్‌మనీ ఎంతంటే?