రాష్ట్రంలో మరో 1,432 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,17,670కి చేరింది. కొవిడ్‌తో తాజాగా 8 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 1,249కి పెరిగింది.
కొత్తగా వైరస్ నుంచి 1,949 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా నుంచి ఇప్పటివరకు 1,93,218 మంది బాధితులు బయట పడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం 23,203 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 19,084 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 244 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ 115, రంగారెడ్డి జిల్లాలో 88 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: నాగార్జునసాగర్ 18 గేట్లు ఎత్తి నీటి విడుదల