శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దాదాపు వంద మంది స్వాములు సికింద్రాబాద్ గణపతి ఆలయం నుంచి పాదయాత్రగా శబరిమల బయలుదేరారు. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకున్నవారు ఈ పాదయాత్ర చేస్తున్నారు. కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. వేణుగోపాల గురు స్వామి ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఈ పాదయాత్ర కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు 1575 కిలోమీటర్ల దూరం... తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా పాదయాత్ర సాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'