ETV Bharat / state

Electricity: 6 నెలల్లో రికార్డుస్థాయిలో కొత్త విద్యుత్​ కనెక్షన్లు

గ్రేటర్​లో రోజురోజుకు విద్యుత్​ డిమాండ్​తో పాటు కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయి. ఆరు నెలలుగా శివారు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు భారీగా చేపడుతున్న నేపథ్యంలో కనెక్షన్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోందని విద్యుత్​శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్​ జోన్​ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఆరు నెలల్లో రికార్డుస్థాయిలో 1.26 లక్షల కొత్త విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసినట్లు విద్యుత్ శాఖ చెబుతోంది. అంటే నెలకు సగటున 21,000ల విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

1.26 lakh new electricity connections in six months in Greater Hyderabad
Electricity: 6 నెలల్లో రికార్డుస్థాయిలో కొత్త విద్యుత్​ కనెక్షన్లు
author img

By

Published : Aug 12, 2021, 10:11 AM IST

గ్రేటర్ పరిధిలో నగర శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. మేడ్చల్‌, రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, హబ్సీగూడ, సైబర్‌సిటీ సర్కిల్‌ ప్రాంతాల్లో కొత్త గృహనిర్మాణాల సంఖ్య వేలల్లో ఉంటోంది. వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. దీంతో విద్యుత్‌ కనెక్షన్లతో పాటు.. విద్యుత్ డిమాండ్​ పెరుగుతోంది.

మేడ్చల్‌లో అత్యధికంగా 23 వేలు

మేడ్చల్‌ సర్కిల్‌ పరిధిలో ఏడాదిన్నరగా 490 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయగా, అందులో 380 ప్రైవేటు వారికే కేటాయించామని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడేలా విద్యుత్‌ శాఖ కొత్త లైన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. గత సంవత్సరం ఆరు నెలల్లో వినియోగదారులకు 95,938 కొత్త విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేస్తే.. ఈ ఏడాది వాటికంటే 30,892 ఎక్కువ కొత్త కనెక్షన్లు మంజూరు అయ్యాయని విద్యుత్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా మేడ్చల్‌ సర్కిల్‌ పరిధిలో 23,337 కనెక్షను మంజూరైనట్లు అధికారులు తెలిపారు.

పెరుగుతున్న డిమాండ్‌

కొత్త కనెక్షన్ల సంఖ్య పెరగడంతో గ్రేటర్‌ జోన్‌లో విద్యుత్‌ డిమాండ్‌ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. గ్రేటర్‌ జోన్‌లో మొత్తం 52.67 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా... సాధారణంగా రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 55-60 మిలియన్‌ యూనిట్లుగా నమోదవుతుందని ఎన్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఇక వేసవిలో అది 75-80 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంటుందని పేర్కొంటున్నారు.

15 శాతం పెరుగుదల

విద్యుత్‌ కనెక్షన్లు పెరిగితే.. మరో రెండు మూడేళ్లలో డిమాండ్‌ 100 మిలియ్లకు చేరుకుంటుందని ఎస్పీడీసీఎల్‌ అంచనా వేస్తోంది. దీనంతటికి ప్రధాన కారణం.. శివారు ప్రాంతాల్లో ఏటా 15 శాతం విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య పెరుగుతోందని విద్యుత్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సబ్‌స్టేషన్లపై అదనపు లోడ్‌ పడకుండా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతో పాటు... విద్యుత్‌ డిమాండ్‌ ఏ స్థాయిలో పెరిగినా అంతరాయాలు తలెత్తకుండా నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడంతోనే విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నాయంటున్నారు.

గ్రేటర్​లో ఎన్ని విద్యుత్ కనెక్షన్లు పెరిగినా... నాణ్యమైన విద్యుత్​ను నిరంతరం సరఫరా చేసేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కనెక్షన్లు పెరిగినా.. అందుకు సరిపడా విద్యుత్​ను అందించేందుకు కృషిచేస్తామంటున్నారు.

ఇదీ చూడండి: Electricity usage : వర్షాకాలమే అయినా.. విద్యుత్​ను తెగ వాడేస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.