"కేరళ వరదల సమయంలో మత్స్యకారులు ప్రముఖ పాత్ర పోషించారు. వారి ఇళ్లు, పడవలు ధ్వంసమైనా ప్రాణాలను పణంగా పెట్టి బాధితులను కాపాడారు. ఓ వృద్ధున్ని పడవలోకి ఎక్కించడానికి మత్స్యకారుడు నీటిలో పడుకొని సహాయపడిన తీరు వారి గొప్పదనాన్ని వెల్లడిస్తోంది. సహాయక కార్యక్రమాల్లోనూ మత్స్యకారులు కీలకంగా వ్యవహరించారు. నోబెల్ శాంతికి వారు అర్హులు."
-శశిథరూర్, ఎంపీ
2018 ఆగస్టులో నైరుతి రుతుపవనాలతో కేరళలో భారీ వర్షాలు కురిశాయి. వరదలతో కేరళ పూర్తిగా ధ్వంసమైంది. ఈ విపత్తులో సుమారు 488 మంది మరణించారు.