ETV Bharat / state

వికారి ఆగమనం.. సంతోషాలకు శుభారంభం..

ఉగాది... తెలుగు సంవత్సరాది. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఈ పండుగ నాడు చేసుకునే పచ్చడిలాగే జీవితం కూడా కష్ట సుఖాల సమ్మేళనమని అంటుంటారు. అన్నింటినీ అనుభవిస్తూ... ఆస్వాదిస్తూ... సాగిపోవడమే జీవితమని చెప్పే పండుగ. శ్రీ విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... శ్రీ వికారి నామ సంవత్సరం వచ్చేసింది.

వికారి ఆగమనం.. సంతోషాలకు శుభారంభం..
author img

By

Published : Apr 6, 2019, 6:04 AM IST

Updated : Apr 6, 2019, 7:02 AM IST

హిందువులు జరుపుకునే పండుగల్లో ఉగాది ప్రముఖమైనది. ఉగాది.. అచ్చమైన ప్రకృతి పండగ. ఇవాళ్టి నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం. ఇది తెలుగువారి మొదటి పండగ అయింది. చైత్ర శుద్ధ పాఢ్యమినే ఉగాదిగా చెబుతారు.

ముఖ్యంగా తెలుగురాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిగా పరిగణిస్తే... మహారాష్ట్రలో గుడిపాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పొయ్​లా బైశాఖ్​ పేర్లతో పండుగను జరుపుకుంటారు. అయితేనేం ఏ పేరుతో పిలిచిన పండుగ నిర్వహణలో పెద్దగా తేడాలు ఉండవు.

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం సంప్రదాయంగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, వ్యయ, ఆదాయ వివరాలు, ఆ ఏడాదిలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు.

జీవితంలోని సుఖదుఃఖాలకు సంకేతం ఉగాది పచ్చడి. తీపి ఆనందాన్ని సూచిస్తే.. బాధలు చేదుని సూచిస్తాయి. ఇలానే ఒక్కో రుచికి ఒక్కో అర్థం ఉంటుంది. కేవలం అది మాత్రమే కాదు... దీని వెనుక ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి.

తీపి (బెల్లం): ఆనందానికి సంకేతంగా చెబుతారు. చేదు (వేప): బాధ కలిగించే అనుభవాలు, ఉప్పు : ఉత్సాహం, జీవిత సారం, పులుపు (చింత): నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, వగరు(పచ్చి మామిడి ముక్కలు): కొత్త సవాళ్లు, కారం: సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులు ఇవన్నీ కలిస్తేనే జీవితం. అందుకే ఉగాది షడ్రుచుల సమ్మేళనమే కాదు... జీవిత పాఠాన్ని నేర్పే పండుగ.

అందుకే ఈ ఉగాది రోజున మనమూ షడ్రుచుల సమ్మేళన పచ్చడి తాగుదాం.. జీవితంలో కష్టదుఃఖాలను దైర్యంగా ఎదుర్కొందాం.

వికారి ఆగమనం.. సంతోషాలకు శుభారంభం..

ఇవీ చూడండి: బాలయ్య... బాలయ్య... ప్రచారం అదిరిందయ్యా!

Last Updated : Apr 6, 2019, 7:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.