ETV Bharat / state

అవసరమైతే జాతీయ పార్టీ ఏర్పాటు..! - trs ready to parlament elections

అసెంబ్లీ ఫలితాల ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్​ ఎన్నికల్లో భిన్నమైన వ్యూహాలతో వెళ్తున్నారు కేసీఆర్. 16సీట్లు ఖాయమని..అవసరమైతే జాతీయ పార్టీ స్థాపించేందుకు అడుగులేస్తున్నారు.

పదహారు స్థానాలు లక్ష్యంగా కారు ప్రయాణం
author img

By

Published : Mar 19, 2019, 4:55 PM IST

150 సీట్లు గెల్చుకోవచ్చు..

లోక్​సభ ఎన్నికల్లో బలం నిరూపించుకునేందుకు తెరాస ఉవ్విళ్లూరుతోంది. సారు, కారు, పదహారు... దిల్లీలో సర్కారు అంటూ శ్రేణులను ఉత్సాహరుస్తోంది. ఓ వైపు ఆత్మవిశ్వాసం, మరో వైపు పక్కా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి వస్తే దాదాపు 150సీట్లు వస్తాయని గులాబీదళం ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

అవసరమైతే జాతీయ పార్టీ..!

ఇద్దరితోనే ఎంపీలతో తెలంగాణ సాధించానని... పదహారు మందిని గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామంటున్నారు కేసీఆర్. . దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిచేందుకు అవసరమైతే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రచారానికి పక్కా ప్రణాళిక

ప్రచారం విషయంలో తెరాస పకడ్బందీగా వ్యవహరిస్తోంది. షెడ్యూలుకు ముందే... పార్లమెంటు సన్నాహక సభలతో జనాల్లోకి వెళ్తున్నారు కేటీఆర్. గ్రేటర్ పరిధిలో కేటీఆర్ రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. మొన్న కరీంనగర్​లో సమరభేరీ మోగించిన కేసీఆర్..16 భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇవీ చూడండి:మెజార్టీతో చరిత్ర సృష్టించిన కేసీఆర్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.