ETV Bharat / state

హస్తినపై పట్టు కోసం గులాబీ దళపతి ప్రయత్నం - trs pracharam

అసెంబ్లీ ఫలితాల ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్​ ఎన్నికల్లో భిన్నమైన వ్యూహాలతో వెళ్తున్నారు కేసీఆర్. 16సీట్లు ఖాయమని..అవసరమైతే జాతీయ పార్టీ స్థాపించే దిశగా అడుగులేస్తున్నారు.

కారు జైత్రయాత్ర!
author img

By

Published : Mar 21, 2019, 9:55 AM IST

Updated : Mar 21, 2019, 10:59 AM IST

కారు జైత్రయాత్ర!
150 సీట్లు గెల్చుకోవచ్చు..

లోక్​సభ ఎన్నికల్లో బలం నిరూపించుకునేందుకు తెరాస ఉవ్విళ్లూరుతోంది. సారు, కారు, పదహారు... దిల్లీలో సర్కారు అంటూ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. ఓ వైపు ఆత్మవిశ్వాసం, మరో వైపు పక్కా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నిఒకే వేదికపైకి వస్తే దాదాపు 150 సీట్లు వస్తాయని గులాబీదళం ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తోంది.

అవసరమైతే జాతీయ పార్టీ..!

ఇద్దరితోనే ఎంపీలతో తెలంగాణ సాధించానని... పదహారు మందిని గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామంటున్నారు కేసీఆర్. . దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిచేందుకు అవసరమైతే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రచారానికి పక్కా ప్రణాళిక

ప్రచారం విషయంలో తెరాస పకడ్బందీగా వ్యవహరిస్తోంది. షెడ్యూలుకు ముందే... పార్లమెంటు సన్నాహక సభలతో జనాల్లోకి వెళ్లిన కేటీఆర్... గ్రేటర్ పరిధిలో రోడ్ షోలు, సభల్లో సైతం పాల్గొననున్నారు. మొన్న కరీంనగర్​లో సమరభేరీ మోగించిన కేసీఆర్..16 భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇవీ చూడండి:భారత్​ భేరి: అగ్రనేత అంతరంగం ఏంటి...?

Intro:Body:Conclusion:
Last Updated : Mar 21, 2019, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.