ETV Bharat / state

తెదేపాకు సేవలందిస్తున్న సంస్థలో తనిఖీలు - madhapur

తెదేపాకు సేవలందిస్తున్న హైదరాబాద్ మాదాపూర్​లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు సైబరాబాద్ పోలీసులు సోదాలు చేశారు. ఏపీ ఓటర్ల వివరాలను సంస్థ దుర్వినియోగపరుస్తుందన్న వైకాపా నేతల ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.

తెదేపాకు సేవలందిస్తున్న సంస్థలో తనిఖీలు
author img

By

Published : Mar 3, 2019, 9:16 AM IST

హైదరాబాద్‌ మాదాపూర్‌లో తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ సాఫ్ట్ వేర్ కార్యాలయంపై సైబరాబాద్‌ పోలీసుల సోదాలు కలకలం రేపాయి. వైకాపా నేతల ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్స్‌లో అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు..కేసు నమోదు చేశారు. హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని... ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులు... ఐటీ గ్రిడ్స్‌లో తనిఖీ చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. దీనికి మాదాపూర్ పోలీసులు నిరాకరించారు.

వైకాపా నేతల ఫిర్యాదు
నిబంధనలకు విరుద్ధంగా ఐటీ గ్రిడ్ సంస్థ... ఏపీ ప్రజల ఆధార్, ఓటర్, కులం, ప్రాంతం, ఇతర వివరాలు తెలిపే విధంగా తెదేపాకు మొబైల్ అప్లికేషన్ రూపొందించి ఇచ్చిందని వైకాపా ఫిర్యాదు చేసింది. సేవామిత్ర యాప్ డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ఆ వివరాలు అందుబాటులోకి వస్తాయని..వైకాపా నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇదే ఐటీ సంస్థ కూకట్‌పల్లిలోని మరో సంస్థ నుంచి వివరాలు సేకరించిందంటూ మరో వైకాపా నేత తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి సైబరాబాద్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం ఫేస్‌బుక్‌ అధికారిక పేజ్‌లో సేవామిత్ర వివరాలున్నాయని అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ఆధార్‌ కార్డులు, ఏపీ స్మార్ట్‌పల్స్ సర్వే, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌తో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న కావ్య డేటా మేనేజ్‌మెంట్ సర్వీస్ నుంచి ప్రజా సాధికారవేదిక వివరాలు తీసుకుందని లోకేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం డేటాను ఐటీ గ్రిడ్స్‌ ఇండియా సంస్థ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. 2012లో సుప్రీం జారీచేసిన ఆదేశాల ప్రకారం ఏ రాజకీయపార్టీ కూడా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోరాదని..ఇందుకు విరుద్ధంగా తెలుగుదేశం వ్యవహరిస్తోందని లోకేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వీటి సాయంతో 2014 ఓటరు జాబితాలో ఉన్న పేర్లను..2019 ఓటరు జాబితాలో తొలగించారని కోరారు.

undefined

వైకాపా నేతల ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, పత్రాలను తనిఖీ చేశారు. అనంతరం హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకుని... సంస్థకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు.

హైదరాబాద్​కు ఏపీ పోలీసులు
తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా...ఏపీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తనిఖీలకు అవకాశం ఇవ్వాల్సిందిగా మాదాపూర్ పోలీసులను కోరారు. దీనికి మాదాపూర్ పోలీసులు నిరాకరించారు. ప్రస్తుతం కార్యాలయంపై కేసు నమోదైందని.... దర్యాప్తు దశలో ఉన్నందున అనుమతించమని మాదాపూర్ పోలీసులు బదులిచ్చారు. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి తప్పిపోయినట్లు గుంటూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైనట్లు మాదాపూర్ పోలీసుల దృష్టికి తీసుకురాగా..దర్యాప్తులో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని..మాదాపూర్ పోలీసులుతెలిపారు. ఆ తర్వాత ఏపీ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

New Delhi, Mar 03 (ANI): After snubbed by the Congress party, Delhi's ruling Aam Aadmi Party (AAP) on Saturday announced candidates for six out of seven Lok Sabha seats, which are at stake in the city-state. The party has fielded Raghav Chadha from South Delhi. Talking to ANI, Raghav said, "Whatever Sheila Dikshit ji said yesterday or Rahul Gandhi himself told Arvind Kejriwal, their stand is very clear that Congress does not want an alliance with Aam Aadmi Party in Delhi. In fact we have started believing that Congress wants to beat AAP in Delhi, SPA-BSPA in Uttar Pradesh. They want to beat Mamata Banerjee's party in West Bengal. Their goal is not to beat BJP but to beat opposition who are competing with BJP in the state. In this situation any talk of alliance is baseless.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.