టెన్నిస్ కోర్టు ప్రారంభించిన సానియా మీర్జా హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాల ప్రాంగణంలో ఉస్మెకాన్ 80 ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు వేడుకకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా హాజరయ్యారు. కళాశాలకు చెందిన 1980 బ్యాచ్ విద్యార్థులంతా కలిసి మెగా రీయూనియన్ పేరుతో ఈ ఉత్సవాలను జరిపారు. పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటైన టెన్నిస్ కోర్టును సానియా ప్రారంభించారు. తన బయోపిక్‌పై అగ్రిమెంట్ కుదిరిన విషయాన్ని తెలిపారు. ఎవరు నటిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.