తెలంగాణ ఉద్యమంలో నమోదైన రైల్వే కేసుల న్యాయశాఖ ఎత్తివేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, కోదండరాం, నాయిని నర్సింహారెడ్డి, జగదీష్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, విఠల్, వివేక్ మరికొంత మందిపై ఉన్న కేసులు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ ఎన్నికల ముందే ఉత్తర్వులిచ్చినా... కోడ్ అమలులో ఉన్నందున ఉపసంహరణను నిలిపివేసింది.
