ప్రజాస్వామిక వాదులపై కొనసాగుతున్న నిర్బంధాలకు వ్యతిరేకంగా కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ సంస్థ సదస్సు నిర్వహించింది. ప్రశ్నించే గొంతుకపై పాలకులు విధిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా పలువురు వక్తలు గళమెత్తారు. 'ధిక్కార స్వరాలు వినిపిద్దాం' అంటూ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ నిరసన సభకు పౌరహక్కుల నేత ప్రొ. హరగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజాస్వామికవాదులపై నిర్బంధాన్ని నిరసిస్తూ రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాటం చేస్తున్న వారిని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ధిక్కార స్వరం వినిపించడానికి కూడా అనుమతించని ప్రభుత్వాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అమలు చేయాలని.... రాజకీయ ఖైదీలైన ప్రొ. సాయిబాబా, విరసం నేత వరవరరావులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుభవార్త