క్రూర మృగానికిదొరికిపోయారు అటవీశాఖ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. కర్నూలు జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ప్రమాదవశాత్తూ ఓ భల్లూకం పడిపోయింది. ఇది గమనించిన అటవీశాఖ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలో పడిన మృగాన్ని వల సాయంతో బయటకు తీసే ప్రయత్నం చేశారు అధికారులు. కొంత దూరం వచ్చే వరకు బాగానే ఉంది. గుమిగూడిన జనాన్ని చూసి భయపడిన ఎలుగు... తప్పించుకునేందుకు అధికారులపైకి దూకింది. అప్పుడు భయంతో అధికారులు పరుగులు పెట్టారు.భల్లుకానికి దొరికిన ప్రొటెక్షన్ వాచర్
ఈ క్రమంలోనే ప్రొటెక్షన్ వాచర్ విజయ్ కుమార్ కిందపడిపోయారు. నీటిలో పడిపోయి ఎటూ కదల్లేకపోయారు. క్రూర మృగానికిదొరికిపోయారు. నీటిలోనే అతనిపై దాడి చేసిన భల్లూకం... తీవ్రంగా గాయపరిచింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు... అప్రమత్తమై... కేకలు వేసి... ఎలుగుబంటిని భయపెట్టి పారిపోయేలా చేశారు.ప్రమాదంలో గాయపడిన విజయ్ కుమార్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు సర్వజనాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి...
ప్రజాపోరులో తెదేపా బంధువుల సందడి