ఆమె నమ్మకాన్ని నిలబెడతాం
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసును ఏపీ పోలీసులు తెలంగాణకు బదిలీ చేశారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావును దర్యాప్తు అధికారిగా నియమించామన్నారు. జయరాం సతీమణి పద్మశ్రీ ఫిర్యాదులోని అంశాలను జోడించి దర్యాప్తు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. ఆమె హైదరాబాద్ పోలీసులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
