కేరళ అనగానే గుర్తుకొచ్చే కాఫీ తోటలు, పడవలో ప్రయాణం, కేరళ సంప్రదాయ నృత్యాలు, కలరియపట్టు విన్యాసాలు ఈ అవగాహన సదస్సులో కళ్లకు కట్టాయి.
మొన్నటి వరదల నుంచి కోలుకుని పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. టూరిస్ట్ ప్లానర్స్, రిసార్ట్స్, హోటల్స్ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రకృతి ప్రకోపించినా..పర్యాటకుల ఆదరణకు ఏమాత్రం కొదవలేదని..కేరళ పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ తెలిపారు. కేరళ పునరుద్ధరణలో తెలంగాణ అందించిన సహాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి తెలంగాణ పర్యాటకుల సంఖ్య అత్యధికంగా 27.5 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేరళ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.