అటవీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా విద్యుత్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అటవీ, జంతు సంరక్షణ, ఎక్సైజ్, నార్కోటిక్ చట్టాలను కఠినంగా అమలు పరచాలని.. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించింది.
కవ్వాల్, ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాల్లో పులుల పరిరక్షణకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు అటవీ అధికారులకు సూచించింది. ఫారెస్ట్ గార్డులు, అటవీశాఖ రక్షణ సిబ్బందికి ఆయుధాల వినియోగానికి అనుమతించాలని పేర్కొంది.
విద్యుత్ లైన్లకు ఇన్సులేషన్ చేయాలన్న ఆటవీశాఖ అధికారుల సూచనలు అమలు చేయాలని విద్యుత్ శాఖకు సూచించింది. అక్రమ విద్యుత్ వినియోగంలో భాగంగా కొక్కేలు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. తనిఖీలు చేసి భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం నివేదిక ఇవ్వాలని పలు జిల్లాల అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.