గవర్నర్ వాహనం వెళ్లేందుకు ప్రొటోకాల్‌లో భాగంగా పోలీసులు ట్రాఫిక్ ఆపారు. అక్కడ చిక్కుకున్న అంబులెన్స్‌ను గుర్తించి దారిచ్చారు గవర్నర్ నరసింహన్. ఈ అరుదైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రాజ్‌భవన్ నుంచి ఇఫ్తార్ విందు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి గవర్నర్ నరసింహన్ ఇవాళ సాయంత్రం బయలుదేరారు. కాన్వాయ్ వెళ్లేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అక్కడ ఓ అంబులెన్స్ కూడా నిలిచి ఉండటాన్ని గమనించిన గవర్నర్... ముందుగా అంబులెన్స్‌ను పంపించి తర్వాత వారు వెళ్లారు.
ఇవీ చూడండి: గవర్నర్‌తో కేసీఆర్, జగన్ భేటీ