రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కోటి రూపాయలకుపైగా విలువైన 3.3కిలోల బంగారు బిస్కట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ రవి నేతృత్వంలో అధికారుల బృందం అర్థరాత్రి 12.45గంటల ప్రాంతంలో సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీ చేశారు. చౌటపల్లి సురేష్ అనే ప్రయాణికుడి వద్ద బూట్లలో దాచిన బంగారం బయట పడింది. అదుపులోకి తీసుకున్న ప్రయాణికుడిని ఆ బంగారం హైదరాబాద్‌లో ఎవరికి సరఫరా చేసేందుకు తెచ్చాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఇవీ చూడండి: నిర్మల్ జిల్లాలో మంత్రి కొడుకు హల్చల్...
శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ బంగారం - seezed
బంగారాన్ని ఎన్నో విధాలుగా స్మగ్లింగ్ చేస్తున్నారు స్మగ్లర్స్. శంషాబాద్ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు.