సామాన్యులపై భారం తగ్గించడానికి ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తమ హయాంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 80 శాతం పెరిగి, 6.58 కోట్లకు చేరిందన్నారు. పన్నుల విభాగంలో త్వరలో ఆన్లైన్ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. వచ్చే 2 ఏళ్లలో దాదాపు ఐటీ రిటర్నలన్నీ సాంకేతిక వ్యవస్థ ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేస్తామని గోయల్ వెల్లడించారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)