ETV Bharat / state

హైదరాబాద్​లో 7వ ఆర్థిక గణన కార్యశాల - hyderabad

కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక గణనలో మొదటిసారిగా మొబైల్​ అప్లికేషన్​ ద్వారా సమాచారాన్ని సేకరించనున్నారు. ఇవాళ హైదరాబాద్​లో 7వ ఆర్థిక గణన కార్యశాలలో రాష్ట్రస్థాయి అధికారులకు కేంద్ర బృందం శిక్షణ ఇచ్చారు.

హైదరాబాద్​లో 7వ ఆర్థిక గణన కార్యశాల
author img

By

Published : May 29, 2019, 4:55 PM IST

కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్​లో 7వ రాష్ట్రస్థాయి ఆర్థిక గణనపై కార్యశాల నిర్వహించారు. బేగంపేట సెస్​ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నోడల్​ అధికారులు, ఎన్​ఎస్​ఎస్​ఓ, సీఎస్​సీ అధికారులు హాజరయ్యారు. 2019 ఆర్థిక సంవత్సరంలో చేయనున్న 7వ ఆర్థిక గణనకు సంబంధించి సమాచార సేకరణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆర్థిక గణనలో మొదటి సారిగా చరవాణి ఆధారిత అప్లికేషన్​ ద్వారా దేశ భౌగోళిక స్థిర, చరాస్తుల సమాచారాన్ని సేకరించనున్నారు. రియల్​టైమ్​ వాలిడేషన్​ కోసమే ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు వక్తలు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే సర్వే నిర్వాహకులకు జూన్​లో జిల్లా స్థాయి శిక్షణ ఉంటుందని ఎన్​ఎస్​ఎస్​ఓ ప్రతినిధులు పేర్కొన్నారు.

హైదరాబాద్​లో 7వ ఆర్థిక గణన కార్యశాల

ఇవీ చూడండి: ముజఫర్​నగర్​ అల్లర్ల కేసులో అందరూ నిర్దోషులే!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.