ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించే విధంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కాచిగూడ ఏసీపీ సుధాకర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ హబ్సిగూడలోని స్ట్రీట్ నెంబర్.1లో 100 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇల్లు తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూన్లో పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇళ్ల అద్దె కోసం కొత్త వ్యక్తులు వస్తుంటారని... వారి పూర్తి వివరాలు తెలుసుకొన్న తర్వాతే ఇంటిని అద్దెకు ఇవ్వాలని ఇంటి యజమానులకు సూచించారు.
ఇవీ చూడండి: