తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ పరిశ్రమలో నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సిప్పెట్) డైరెక్టర్ ఏవీఆర్ కృష్ణారావు అన్నారు.
ఒక్క హైదరాబాద్‌లోనే ప్లాస్టిక్ తయారీ సంస్థలు ఎనిమిది వందలకు పైగా ఉన్నాయని... ఒక్కో సంస్థకు నైపుణ్యం కలిగిన ఆపరేటర్లు 10 నుంచి 15 మంది అవసరం ఉంటుందని తెలిపారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సిప్పెట్‌లో నాలుగు రకాల డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. పరిశ్రమలకు సంబంధించి శిక్షణ, సాంకేతిక సహకారం తమ సంస్థ అందచేస్తుందని... డిప్లొమా పూర్తి చేసినట్లయితే పూర్తి స్థాయి నైపుణ్యత కలిగి బయటకు వస్తారని... అక్కడ ఉండగానే ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన వివరించారు. తాజాగా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మూడు నెలలు, ఆరు నెలలు స్వల్పకాలిక కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చామని..ఈ అవకాశాన్ని పదో తరగతి నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నెలాఖరు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 36 కౌంటింగ్ టేబుళ్లతో ఇందూరు మరో రికార్డు