రాజస్థాన్ సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి ముగ్ధాసింగ్ వీడియో కాన్ఫనెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దాదాపు 10 మంది ఉన్నతాధికారులు, 33 జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా..తెరపై బూతుచిత్రం దర్శనమిచ్చింది. ఈ దృశ్యాన్ని చూసి అధికారులంతా తెల్లమొహాలు వేశారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పౌరసరఫరాల కార్యదర్శి ముగ్ధాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆమె ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్లో బూతుచిత్రం
అధికారులంతా సమీక్షలో మునిగిపోయారు. పౌరసరఫరాల కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అందరూ తలమునకలై ఉండగా ఇంతలో తెరపై నీలిచిత్రం దర్శనమిచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి అంతా షాకయ్యారు.