పోడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడెం, ఏడ్పుల గూడెంలలో పోడు రైతులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకుంటున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య పోడు రైతులు, అటవీ శాఖ సిబ్బందితో చర్చించారు.
పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకూ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. పలుమార్లు ఈ విషయం చెప్పినట్లు గుర్తుచేశారు. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోకపోతే… ఆ విధంగా ప్రవర్తించే అధికారులను ఉపేక్షించేది లేదని ఫారెస్ట్ సిబ్బందిని హెచ్చరించారు.
ఇదీ చూడండి: raithubandhu: జూన్ 15 నుంచి రైతుబంధు సాయం పంపిణీ