ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆర్టీసీ కార్మికుల పిల్లలు ధర్నా చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కార్మికుల పిల్లలు నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు అధికారులు కూడా మద్దతు తెలపాలని జేఏసీ నాయకులు కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీని విలీనం చేయాలంటూ కార్మిక పిల్లల ధర్నా... - ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సమస్యలు పరిష్కరించాలని కార్మికుల పిల్లలు నిరసన వ్యక్తం చేశారు.
![ఆర్టీసీని విలీనం చేయాలంటూ కార్మిక పిల్లల ధర్నా...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4877284-thumbnail-3x2-childrens.jpg?imwidth=3840)