భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కోదండరాముని తిరువీధి సేవ నేత్రపర్వంగా కొనసాగుతోంది. ఈనెల 27 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. వామనావతారంలో జానకిరాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ప్రధాన ఆలయం నుంచి బయలుదేరిన దశరథ తనయుడు అంగరంగ వైభవంగా తిరు వీధుల్లో విహరించారు. అనంతరం మిథిలా ప్రాంగణం వద్ద భక్తులకు కనువిందు చేశారు. నీల మేఘశ్యాముని దర్శనంతో గురు గ్రహ బాధలు తొలగుతాయని పండితులు తెలిపారు.
ఇవీచూడండి: ఇది విన్నారా.. శ్రీవారిని దర్శించుకున్న భక్తుడికి ఉచిత లడ్డు