ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో మళ్లీ విషజ్వరాల విజృంభణ

ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలకు తోడు... గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం, కాలనీలు, డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండటం వల్ల గ్రామాల్లో సీజనల్ వ్యాధుల పరంపర మళ్లీ మొదలైంది. వైరల్ ఫీవర్స్ వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అయితే పడకలు సరిపోక ఒకేదానిపై ఇద్దరు ముగ్గురు చొప్పున పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గతేడాది డేంబర్ బెల్స్ మోగించిన మండలాల్లోనే ఈ సారి కూడా డెంగీ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది.

ఖమ్మం జిల్లాలో మళ్లీ విషజ్వరాల విజృంభణ
author img

By

Published : Aug 26, 2019, 7:56 PM IST

ఖమ్మం జిల్లాలో మళ్లీ విషజ్వరాల విజృంభణ

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ఇంటికి ఒకరిద్దరు జ్వర పీడితులవుతున్నారు. వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా వంటి రోగాలతో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏడు ఏరియా ఆస్పత్రులు, 57 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నా... అన్ని ఆస్పత్రుల్లోనూ జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే పడకలు సరిపోక ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులను పడుకోబెట్టి చికిత్స చేయాల్సి వస్తోంది.

ఆస్పత్రులు ఫుల్... జేబుల్ నిల్...

గతేడాది రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన బోనకల్లు, చింతకాని మండలాల్లో... ఈ సారి కూడా విషజ్వరాలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విషజ్వరాలతో ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే... అక్కడ సరైన వైద్య సేవలు అందక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారి జేబులకు చిల్లుపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధరణ పరీక్షకు 800 నుంచి 1600 రూపాయల వరకు ఖర్చవుతోంది. అంతేకాదు ప్లేట్​లెట్స్ తగ్గాయంటూ వారం రోజుల వరకు ఆస్పత్రుల్లోనే ఉంచుకోవడం వల్ల వేలకు వేలు ఆస్పత్రుల్లో చెల్లించాల్సి వస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముందే చర్యలు తీసుకుంటే బాగుండేది

మరోవైపు ప్రతీ సీజన్​లోనూ విషజ్వరాల విజృంభనకు వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యమూ ఓ కారణమని చెప్పక తప్పదు. విషజ్వరాల విజృంభన, దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడం పరిస్థితిని మరింత జఠిలం చేస్తోంది. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ... అవి సత్ఫలితాలనివ్వడం లేదు. తీరా సీజనల్ వ్యాధులు విజృంభించాక హడావిడి చేస్తున్నారే తప్ప ముందుస్తు చర్యల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు మాత్రం నిర్వహించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి.

ఇవీ చూడండి: సింధు గెలుపు.. క్రీడారంగంలో గొప్ప మలుపు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.