భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్లలోని శ్రీ శ్రీ రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నాగభూషణం పాల్గొన్నారు.
నూతన హంగులతో నిర్మాణం చేపట్టనున్న ఆలయానికి వేదపండితులు.. మంత్రోచ్ఛారణలతో భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాకర్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి: కాలభైరవ ఆలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే