సింగరేణి నిర్వాసితుల కాలనీ వాసులకు స్థానిక కూరగాయల వ్యాపారి నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశాడు. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఆర్థికంగా సతమతమతున్న సింగరేణి నిర్వాసితుల కాలనీలోని పేదలకు కూరగాయల వ్యాపారి హరి కృష్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, సీఐ వేణు చందర్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు.
ప్రజలందరూ తమవంతు బాధ్యతగా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు చేతనైన సాయం చేయాలని దాతలు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..