ETV Bharat / state

వనమా రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ - Palvancha suicide case updates

వనమా రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

author img

By

Published : Jan 8, 2022, 1:28 PM IST

Updated : Jan 8, 2022, 3:05 PM IST

13:26 January 08

Vanama Raghava judicial custody: వనమా రాఘవకు జ్యుడిషియల్ రిమాండ్

వనమా రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Vanama Raghava judicial custody: పాల్వంచలోని నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కొత్తగూడెం మెజిస్ట్రేట్‌ ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్​ విధించింది. వనమా రాఘవను భద్రాచలం సబ్‌ జైలుకు పోలీసులు తరలించారు.

Palvancha suicide case: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం పాల్వంచ‌లోని రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం తానేన‌ని వ‌న‌మా రాఘ‌వ పోలీసుల ముందు ఒప్పుకున్నాడ‌ని ఏఎస్పీ రోహిత్ తెలిపిన విష‌యం తెలిసిందే. రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌, వ‌న‌మా రాఘ‌వ కేసుకు సంబంధించి మీడియా స‌మావేశంలో మాట్లాడిన రోహిత్.. వ‌న‌మా రాఘ‌వ‌పై ఈ కేసుతో పాటు మ‌రో 12 కేసులు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలోని దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశాం. రాఘవతో పాటు గిరీష్, మురళిని అరెస్ట్ చేశాం. రాఘవ పరారయ్యేందుకు చావా శ్రీనివాస్, రమాకాంత్​ సహకరించారు. పలు అంశాలపై రాఘవను విచారించాము. రామకృష్ణను బెదిరించినట్లు అతను ఒప్పుకున్నాడు. నిందితులను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరుస్తాం. కొత్తగూడెం మెజిస్ట్రేట్‌ ముందు రాఘవను హాజరుపరుస్తాం. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయి. గతంలో నమోదైన కేసులపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం.'

-రోహిత్ రాజ్, ఏఎస్పీ

గతంలో నమోదైన కేసులు వెలికి..

ఈ నెల 3న భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ.. అంతకుముందు తీసుకున్న సెల్ఫీవీడియోలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అవమానం భరించలేక కుటుంబంతో సహా చనిపోతున్నట్లు రామకృష్ణ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న రాఘవ ఆచూకీ కోసం పోలీసులు... రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు.. మందలపల్లి అడ్డరోడ్డు వద్ద రాఘవను పోలీసులు పట్టుకున్నారు. గతేడాది వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో రాఘవకు నోటీసులు ఇవ్వటం సహా.. రాఘవపై గతంలో నమోదైన కేసులను పోలీసులు వెలికితీస్తున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న వనమా రాఘవను.. ఇప్పటికే తెరాస అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది.

మరో వీడియో..

Palvancha Family suicide : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పాల్వంచ ఆత్మహత్య కేసులో మరో కీలక వీడియో లభించింది. బాధితుడు రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. రాఘవతో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానంటూ పలు వివరాలను ఆయన వీడియోలో చెప్పారు. తన బలవన్మరణానికి సూత్రధారి రాఘవేనని రామకృష్ణ ఆరోపించారు. తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారన్న రామకృష్ణ.. తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.

ఆది నుంచీ వివాదాస్పదమే..

వనమా రాఘవేంద్రరావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఘటనల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజాప్రతినిధి కుమారుడిగా వనమా.. రాజకీయ వారసుడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న రాఘవ తీరు ఆది నుంచీ వివాదాస్పదమే. పాల్వంచ గ్రామీణం, పట్టణ పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటి వరకు మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో వనమా రాఘవేందర్‌రావుపై పలు సెక్షన్ల కింద 2 కేసులు నమోదయ్యాయి. 2013లో ప్రభుత్వ ఉద్యోగి ఉత్తర్వులు ఉల్లంఘించి, ఎన్నికల్లో డబ్బులు ఎర వేశారని కేసు నమోదైంది. అదే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యం చేశారంటూ కేసు ఉంది. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 2006లో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అల్లరి మూకలతో కలిసి హంగామా చేశాడన్న ఆరోపణలపై కేసును ఎదుర్కొన్నాడు. 2017లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. 2020లో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు పెట్టారు.

గిరిజన మహిళపై హత్యాయత్నం కేసులో..

2021లో ఆత్మహత్యకు పురిగొల్పారంటూ రాఘవపై కేసు నమోదైంది. పలువురి ఆత్మహత్యలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. గిరిజన మహిళ జ్యోతికి చెందిన స్థలం వివాదంలో రాఘవేంద్రరావు అనుచరులు ఆమెపై భౌతికదాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన మహిళపై హత్యాయత్నం కేసులో రాఘవేంద్రరావు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకూ వెళ్లడం సంచలనం రేపింది. పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దాదాపు 20 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసి కేసు నుంచి బయటపడ్డాడు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులోనూ ఏ2గా రాఘవేంద్రరావుపై పోలీసు కేసు నమోదైంది. అజ్ఞాతంలో ఉన్న అతన్ని సెల్ఫీ వీడియో బయటకులాగింది.

సంచలనమైన సెల్ఫీ వీడియో..

నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో అతని సెల్ఫీ వీడియో సంచలనమైంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.

"రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగాడు. నా భార్యను హైదరాబాద్‌ తీసుకురావాలని కోరాడు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశాడు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు" - సెల్ఫీ వీడియోలో నాగ రామకృష్ణ ఆవేదన

విమర్శలకు కొదవలేదు...

అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడని.. వనమా రాఘవేంద్రరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో పేరుకే తండ్రి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అని.. అంతా కుమారుడిదే రాజ్యంగా సాగుతోందన్న విమర్శలకు కొదవలేదు. నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తారన్న ఆరోపణలు ఆది నుంచీ ఎదుర్కొంటున్నాడు. పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని అధికార యంత్రాంగంపై పెత్తనం చెలాయిస్తాడని వనమా రాఘవపై ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో వ్యక్తిగత పంచాయితీల నుంచి భూవివాదాలు, సెటిల్మెంట్లలో రాఘవ జోక్యం చేసుకోవడంతో వివాదస్పదమైన సంఘటనలు అనేకం గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత కథనాలు..

Last Updated : Jan 8, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.