భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో ఏజెన్సీ వాసులు, అటవీ శాఖ అధికారులకు పులి సంచారం(Tiger Roaming in Yellandu) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు రోజులుగా స్థానికులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటికే రెండు సార్లు పులి కనిపించిందని పలువురు పేర్కొన్నారు. పోడు భూముల సమస్య దరఖాస్తుల పరిశీలన అంశాల పనుల్లో ఉన్న అటవీ శాఖ అధికారులు.. అనుకోని అతిధి ప్రవేశంతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రత్యేక బృందాలతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పులి ఎక్కడ ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఏజెన్సీ పల్లె జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అమ్మో పులి
టేకులపల్లి అటవీ రేంజ్‌ను పూర్తిగా చుట్టేసిన పులి.. ఇల్లందు మండలంలోని అటవీ పరిధి(tiger roaming news)లోకి ప్రవేశించింది. దోమలగండి అడవిలో పులి సంచారం చేస్తోందన్న అనుమానంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
పాదముద్రలు
ఇదే అడవిలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. ఉదయం 6 గంటల నుంచి పాద ముద్రల సేకరణ చేస్తూ వీటి ఆధారంగా అడవిలో ఉన్నట్లు నిర్ధరించారు. మూడు వాహనాలతో 3 బృందాలు గాలింపు చేస్తున్నట్లు ఇల్లందు ఎఫ్ఆర్వో రవి కిరణ్ తెలిపారు. పులి పాదముద్రలు గుర్తించామని.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ అడవి మార్గంలో వెళ్లొద్దని.. ఒక్కొక్కరుగా బయటకు వెళ్లవద్దని సూచించారు. పశువుల కాపర్లు సైతం రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి: tiger roaming: టేకులపల్లిలో 'పులి'... అటవీ అధికారులు ఏమంటున్నారంటే..