ETV Bharat / state

tiger roaming: టేకులపల్లిలో 'పులి'... అటవీ అధికారులు ఏమంటున్నారంటే.. - తెలంగాణ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది (tiger roaming). టేకులపల్లి పరిధి నుంచి రోల్లపాడు వైపు వరి పొలాల్లో నడుచుకుంటూ వెళ్తున్న పులిని చూసిన కొందరు సెల్​ఫోన్​లో చిత్రీకరించారు. నిన్న జంగాలపల్లి అడవిలో సంచరించిన పులి.. ఇవాళ ఆంజనేయపాలెం అడవుల్లోకి ప్రవేశించిందని స్థానికులు అంటున్నారు.

tiger in bhadradri kothagudem
tiger in bhadradri kothagudem
author img

By

Published : Nov 21, 2021, 7:43 PM IST

ఇల్లందులో 'పులి'... అటవీ అధికారులు ఏమంటున్నారంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు (tiger roaming). ప్రత్యేక గస్తీలను ఏర్పాటు చేసి... అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇల్లందు మండలం టేకులపల్లి అటవీ పరిధిలో పులి తిరుగుతున్నట్లుగా ఇటీవల స్థానికులు గుర్తించారు. రెండ్రోజుల క్రితం మెట్లగూడెం సమీపంలోని జంగలపల్లిగేట్ వద్ద పులి రోడ్డు దాటుతుండగా వాహనదారులు గమనించారు (tiger roaming in yellandu forest area). ఆ దృశ్యాలను సెల్ ఫోన్​లో చిత్రీకరించారు. అంతకుముందే లక్ష్మిదేవీ మండలంలో ఆవులమందపై పులి దాడి చేయగా.... ఓ ఆవు మృతి చెందింది. ఇవాళ ఆంజనేయపాలెం అడవుల్లో సంచరిస్తుండగా... మేకల కాపరులు గమనించారు. పెద్దమ్మతల్లి గుట్ట-ఆంజనేయపాలెం అటవీప్రాంతంలో తాము చూసినట్లు అటవీ సిబ్బందికి తెలిపారు.

పులి పాదముద్రలు సేకరిస్తున్న అధికారులు
పులి పాదముద్రలు సేకరిస్తున్న అధికారులు

భయాందోళనలో స్థానికులు

పులిసంచారంతో టేకులపల్లి మండలంలోని గ్రామాల్లో భయాందోళన నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు, సిబ్బంది.... ప్రజలెవరూ అడవుల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పశువులు, జీవాలపై పులి దాడిచేస్తే తాము పరిహారం చెల్లిస్తామని... ఎవరు కూడా పులికి హాని చేసే చర్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..

పులి వల్ల మనుషులకు గాని.. మనుషుల వల్ల పులికి గాని ఎలాంటి ఆపద రాకుండా అన్ని రకాల చర్యలను ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ తీసుకుంటుంది. పగలు, రాత్రి గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు.. అడవిలోని సుదూర ప్రాంతాలకు వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఒంటరిగా కాకుండా జనం ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వచ్చేయాలి. పశువుల గొట్టాల వద్ద లైట్లు, మంటలు పెట్టుకోవాలి. పులి వల్ల ఏవైనా పశువులు మరణిస్తే అటవీ శాఖ నుంచి వారికి పరిహారం వస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా... అనుమానాస్పదంగా సంచరిస్తున్నా.. ఉచ్చులు, ఉరులు వేసే వారు ఉంటే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. దీని వల్ల పులిని రక్షించుకోవచ్చు, ఎలాంటి ప్రాణ నష్టం కూడా లేకుండా నివారించుకోవచ్చు. -అప్పయ్య, అటవీ అధికారి

ఇదీ చూడండి: new postmortem rules in telangana: పోస్టుమార్టంపై కొత్త మార్గదర్శకాలు.. ఇకపై రాత్రి వేళల్లోనూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.