భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులకు సహాయపడుతున్న ముగ్గురు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్ట్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్న ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు రహదారుల్లో తనిఖీలు చేస్తున్నారు. చర్ల మండలం పూస గుప్ప వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
వారిలో ఒకరు మావోయిస్టు మిలీషియా సభ్యుడు పొడియం ఎడమయ్య, కొరియర్లు పండ, కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. వారి నుంచి 30 జెలిటీన్ స్టిక్స్, 12 డిటోనేటర్ స్వాధీనం చేసుకుని వారిని రిమండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వారోత్సవాలను పురస్కరించుకొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ కైలాస్ అహలా వత్, చర్ల సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఖమ్మంలో 'బంగారు దొంగలు' అరెస్ట్