ETV Bharat / state

Bhadradri Temple: భద్రాద్రిలో ఘనంగా గరుడపటం ఆవిష్కరణ.. పట్టాభిషేకానికి రానున్న గవర్నర్ - శ్రీరామనవమి

Bhadradri Temple: భద్రాద్రి రామయ్య సన్నిధిలో తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ గరుడ పటం ఆవిష్కరణ ఉత్సవం ఆలయంలో వైభవంగా జరిగింది. హోమశాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 11న జరగనున్న పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు.

Bhadradri Temple
భద్రాద్రిలో ఘనంగా గరుడపట ఆవిష్కరణ
author img

By

Published : Apr 8, 2022, 8:00 PM IST

Updated : Apr 8, 2022, 9:43 PM IST

Bhadradri Temple: భద్రాద్రి రామయ్య ఆలయంలో హోమశాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ సమేత సీతారాములతో పాటు గరుడ పటాన్ని ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ పట ఆవిష్కరణ ఉత్సవం నిర్వహించారు. వేదపండితులు, మంత్రోచ్ఛారణలతో అత్యంత వైభవంగా చేపట్టారు. పూజల అనంతరం గరుడ ప్రసాదాన్ని మహిళలకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల సంతానం లేని మహిళలకు గర్భ దోషాలు తొలగిపోతాయని మహిళలు విశ్వసిస్తారు.

పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు: రామయ్య సన్నిధిలో స్వామివారి గరుడ ప్రసాదాన్ని స్వీకరించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ఈ వేడుకలో ఆలయ వైదిక, అర్చక కమిటీలతో ఆలయ ఈవో శివాజీ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం భేరీ పూజ, దేవత ఆహ్వానం, బలిహరణం వేడుకలు నిర్వహించి స్వామివారికి హనుమత్ వాహనంపై తిరువీధి సేవ జరపనున్నారు. రేపటి నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.

ఈనెల 11న మహా పట్టాభిషేకం: శనివారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. ఈనెల 10న మిథిలా ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి 12. 30 గంటల వరకు సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహిస్తారు. ఈనెల 11న మహా పట్టాభిషేకం వేడుక జరగనుంది. పట్టాభిషేకం వేడుకకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు.

కల్యాణ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి: శ్రీరామనవమిని పురస్కరించుకుని జరగనున్న సీతారాముల కల్యాణ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశముంది. అందుకు తగినట్లుగా ఆలయ, జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయానికి విద్యుత్ కాంతులు, మిథిలా ప్రాంగణంలో చలువ పందిళ్లు, సెక్తార్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తుల కోసం 3లక్షల లడ్డూ ప్రసాదాలు, రెండున్నర లక్షల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశామని వెల్లడించారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరా, సేదతీరేందుకు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో చలువ పందిళ్లు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు సమర్పణ

భద్రాద్రి సీతారాముల కల్యాణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్

Last Updated : Apr 8, 2022, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.