Sitaram marriage festival in Bhadradri: భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లోక కల్యాణానికి తేదీ వచ్చేసింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని భద్రాద్రి సీతారాముల వారి కల్యాణానికి ముహూర్తం ఖారారు అయింది. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఈ కల్యాణం జరుగుతోంది. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు వైదిక కమిటీ నిశ్చయించారు. అదే విధంగా మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తామని కమిటీ తెలిపింది.
ఈ ఏడాది జరిగే పట్టాభిషేకానికి ప్రత్యేకత ఉందని కమిటీ సభ్యులు చెప్పారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పట్టాభిషేకమని తెలిపారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ సన్నాహిక బ్రహ్మోత్సవాలు జరపాలని ఆలయ వైదిక కమిటీ పెద్దలు నిర్ణయించారు. ఇటీవల భద్రాద్రిలో లడ్డూల నాణ్యతపై వివాదం తలెత్తిన సందర్భంగా శ్రీరామ నవమికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
గత సంవత్సరం భద్రాద్రిలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం: కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నేపథ్యంలో 2020, 2021లో సీతారామ కల్యాణం నిరాడంబరంగా నిర్వహించారు. 2022 నుంచి మళ్లీ భక్తులు తిలకించేందుకు అవకాశం కల్పించారు. ఆ సంవత్సరం భక్తుల కోసం 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 3 లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డులకు 30 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇవీ చదవండి: