రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా 45 రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు గ్రీన్ జోన్లలో నిబంధనలు సడలించటం వల్ల స్వేచ్ఛగా బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉదయం 6 గంటల నుంచి వాహనదారులు, ప్రజలు బయట తిరిగారు. ఇందులో కొందరు మాత్రం మాస్కులు ధరించి రాగా.. మరికొందరు మాస్కులు లేకుండానే బయటకు వచ్చారు. వలస కార్మికులను ఎక్కడా ఆపకుండా వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.
భద్రాచలంలో యథేచ్చగా రోడ్లపైకి జనం - lock down relaxation in Bhadrachalam
రహదారులపై వాహనాలు కనిపించాయి. రిజిస్ట్రేషన్లు షురువయ్యాయి. రవాణా సేవలు ప్రారంభమయ్యాయి. పలు దుకాణాలు నెలల తర్వాత మళ్లీ కళకళలాడాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం సందడిగా కనిపించింది.
భద్రాచలంలో యథేచ్చగా రోడ్లపైకి జనం