ETV Bharat / state

మృతదేహం దహనంపై వివాదం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సాధారణంగా చనిపోయిన వారి మృతదేహలను గ్రామాల్లో దహనం చేయటం వల్ల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

The burning of corpses is a controversy as the corona epidemic is booming
మృతదేహం దహనంపై వివాదం
author img

By

Published : Apr 22, 2020, 1:32 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం గోదావరి నదీ తీరం వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం రాత్రి దహనం చేయడంపై గ్రామంలో వివాదం చోటుచేసుకుంది. భద్రాచలానికి చెందిన వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ఆసుపత్రిలో మృతి చెందారు. దుమ్ముగూడెం మండలంలో ఇతని బంధువులు ఉండటంతో సోమవారం రాత్రి ఇక్కడ దహన సంస్కారాలు చేశారు.

కరోనా వ్యాప్తి ఉన్న సమయంలో ఎక్కడి నుంచో మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ దహనం చేయడం ఏమిటని కొంతమంది గ్రామస్థులు మృతుని బంధువులను నిలదీశారు. అనంతరం సీఐ వెంకటేశ్వర్లుకు సమాచారం ఇవ్వటం వల్ల మంగళవారం మృతుని బంధువులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.