ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం వల్ల కొత్త కేసులు నమోదు కావడం లేదు.
ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా కేసులు లేని జిల్లాగా మారింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 8 మంది కరోనా బాధితులు ఉండగా.. వారిలో చికిత్స అనంతరం ఇద్దరు డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.
లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్న యంత్రాంగం.. దుకాణాలకు కొంత వెసులుబాటు కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఇచ్చారు. కర్ఫ్యూను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు.