పాముకాటేసింది.. బాలుడి నిండు ప్రాణం పోయింది! - తల్లిదండ్రుల నిర్లక్ష్యం
పాము కాటుకు పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పాము కాటేసిన చిన్నారి ప్రాణాలు తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో గాల్లో కలిసాయి. కుటుంబంలో విషాదం నెలకొంది.
పాముకాటేసింది.. బాలుడి నిండు ప్రాణం పోయింది!
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలోని ఓ గిరిజన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామంలో పాము కాటుతో విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన తాటి చందు ఐదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంవేళ పాము కాటేసింది. కాలు నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ మద్యం మత్తులో ఉన్న బాలుని తండ్రి పట్టించుకోలేదు. తల్లి కూడా నిర్లక్ష్యం వహించింది. అప్పటికే చీకటి పడింది. ఆసుపత్రికి వెళ్లాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పొద్దున్నే వెళ్దామనుకున్నారు. కానీ బాలునికి ఒళ్లంతా విషం పాకింది. సమయం మించిపోయింది. తెల్లారేసరికి ప్రాణం పోయింది. బాలుడి కుటుంబాన్ని చర్ల మండల తహసీల్దార్ రాఘవరెడ్డి పరామర్శించారు. దహన సంస్కారాల నిమిత్తం రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు.
Intro:పాము కాటుకు
Body:విద్యార్థి మృతి
Conclusion:(ఫోటోలు వాట్సాప్ నుంచి తీసుకో గలరు)తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతం లోని ఓ గిరిజన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తిప్పా పురం గ్రామంలో పాము కాటుకు విద్యార్థి మృతి చెందాయి గ్రామానికి చెందిన తాటి చందు అదే గ్రామంలో ఐదవ తరగతి చదువుతున్నాడు బుధవారం రాత్రి పాము కాటు వేయడంతో కాలు నొప్పిగా ఉందని తన తండ్రికి చెప్పాడు కానీ మద్యం మత్తులో ఉన్న తన తండ్రి పట్టించుకోలేదు దీంతో గురువారం విద్యార్థి మృతిచెందాడు విషయం తెలవడంతో విద్యార్థి కుటుంబ సభ్యులను చర్ల మండల తాసిల్దార్ రాఘవరెడ్డి పరామర్శించారు దహన ఖర్చుల నిమిత్తం రూపాయల 5000 ఆర్థిక సహాయం అందించారు