భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మండలాల వారీగా సర్వే చేసి ఈనెల 15 వరకు అటవీ, ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అధీనంలో ఎక్కువ భూమున్నట్లు నిర్ధరణ అయిందని, భవిష్యత్లో జరిగే అభివృద్ధి పనులకు ప్రభుత్వ భూమి ఎంతో అవసరముందని స్పష్టం చేశారు.
ఇల్లందు అతిథిగృహంలో అటవీ, రెవెన్యూ అధికారులతో రేగా కాంతారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మండలాల వారీగా ప్రభుత్వ, అటవీ భూముల వివరాలు తెలుసుకున్నారు. అటవీ, రెవెన్యూ అధికారుల వద్ద భూములకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ఉండాలని తెలిపారు.