ETV Bharat / state

నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం

Sriramanavami Celebrations in Bhadrachalam: లోక కల్యాణంగా భావించే రాములోరి కల్యాణానికి భద్రాద్రి దివ్వక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అభిజిత్ లఘ్నమున సీతారాములకు జరిగే కమనీయమైన కల్యాణ వేడుక భక్త కోటికి మధురానుభూతులను మిగల్చనుంది. జగదేక వీరుడికి, జగన్మాత సీతాదేవికి అత్యంత వైభవోపేతంగా జరిగే వేడుకను కనులారా తిలకించి పులకించేందుకు తరలివస్తున్న భక్తకోటి.. కమనీయ వేడుక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. కరోనా కాటుతో రెండేళ్ల పాటు భక్తుల సందడి లేకుండానే సాగిన కమనీయమైన కల్యాణ వేడుక ఈ సారి అశేష భక్తజన సందడి మధ్య అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది.

నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం
నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం
author img

By

Published : Apr 10, 2022, 1:17 AM IST

Updated : Apr 10, 2022, 4:56 AM IST

నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం

Sriramanavami Celebrations in Bhadrachalam: భద్రాద్రి శ్రీసీతారాముల వారి ఆలయంలో వైభవోపేతంగా సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేక వీరుడు జానకిరాముడు అతిలోక సుందరి సీతమ్మకు జరిగే కమనీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక కల్యాణంగా భావించే కమనీయమైన కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కల్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగనున్నాయి. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరింపజేశారు. అభిజిత్ లగ్నంలో కల్యాణం జరగనుంది. తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు.

రాములోరి కల్యాణం ఇలా: కల్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత..రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేస్తారు.ఇందులో యోక్త్రధారణ రమనీయంగా ఉంటుంది. దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారి నడుముకి బిగిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కడతారు. స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోపవీతధారణ చేస్తారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరుణ నిర్వహించి.. తాంబూలాది సత్కారాలు చేస్తారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయిస్తారు. ఇరు వంశాల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పిస్తారు. వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో అందించే ఈ ఆశీస్సులు కల్యాణం వీక్షించే భక్తులందరికీ వర్తించేలా ఉంటాయి. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠిస్తారు. వేద మంత్రోచ్ఛరణలు మారుమోగుతుండగా.. అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తమని జగత్ కల్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు.

రాములోరి కల్యాణం వీక్షించేలా.. కమనీయంగా సాగే కల్యాణ వేడుకకు ప్రతీ ఏటా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి కల్యాణ వేడుకకు హాజరై ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించేవారు. కానీ.. ఈ ఉత్సవానికి హాజరుకావడం లేదు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక రెండేళ్ల తర్వాత వైభవోపేతంగా సాగే కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భద్రాద్రి వచ్చే వేలాది మందికి ఎలాంటి అసౌర్యం లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు పరమానందం కలిగించే ఈ వేడుక కోసం ఆలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చలువ పందిళ్లు వేసి భక్తులంతా కూర్చుని రాములోరి కల్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు.

రేపు మహాపట్టాభిషేక మహోత్సవం: తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో మరొకటి మహాపట్టాభిషేక మహోత్సవం సోమవారం జరగనుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వామివారి పట్టాభిషేకానికి హాజరుకానున్నారు. ఈ సారి భక్తుల తాకిడి పెరుగుతుండటం, ప్రముఖుల రాక ఎక్కువ ఉండటంతో పోలీసు శాఖ ఎక్కడా ఇబ్బందులు లేకండా దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తుతో ఏర్పాట్లు చేసింది.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​.. శ్రీరామనవమి శుభాకాంక్షలు..

Last Updated : Apr 10, 2022, 4:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.