Varaha avataram in Bhadradri Ramayya: భద్రాచలంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకు ఒక అవతారంలో.. భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడోరోజైన ఇవాళ రాములోరు.. వరాహ అవతారంలో అభయ ప్రదానం చేస్తున్నారు. వరాహ అవతారంలోని స్వామివారిని దర్శించుకుంటే రాహు, గ్రహ బాధలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఉదయం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి.. బేడా మండపం వద్దకు తీసుకొచ్చిన అర్చకులు.. ధనుర్మాస పూజలు చేసి రాజభోగం నివేదన చేశారు.
ఇవీ చదవండి: