ETV Bharat / state

'ఈ సీతారాముల కల్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది..' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

Sriramanavami in Darga: జగదభిరాముని కల్యాణం రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరిగింది. ఊరూ-వాడ చలువ పందిళ్ల మధ్య సీతారాములు ఒక్కటై భక్తులను దీవించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలోని సత్యనారాయణపురంలో జరిగిన ఈ ఉత్సవానికి మాత్రం అన్నింటికంటే ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకో మీరు తెలుసుకోండి.

Sri Rama Navami celebrations at hazarath nagul meera darga
దర్గాలో శ్రీరామనవమి వేడుకలు
author img

By

Published : Apr 10, 2022, 8:31 PM IST

Sriramanavami in Darga: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలోని సత్యనారాయణపురంలో శ్రీరామ నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇంతకీ ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ వేడుక జరిగింది హజరత్ నాగుల్ మీరా దర్గాలో. సీతారాముల కళ్యాణ మహోత్సవం కులమతాలకు అతీతంగా జరిగింది. దర్గాలో జరిగిన ఈ వేడుకకు స్థానిక నేతలు, భక్తులు, ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు.

కులమతాలకు అతీతంగా ఉండే ఈ దర్గాకు రాజకీయ నాయకులు, భక్తులు వస్తుంటారు. గత సంవత్సరం నుంచి సంప్రదాయ రీతిలో వేద మంత్రాలు మంగళవాయిద్యాల నడుమ శ్రీరామనవమి వేడుకలు జరుపుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే రీతిన ఏర్పాట్లు చేశారు. ఇవాళ కళ్యాణం జరిపిన నిర్వాహకులు.. రేపు పట్టాభిషేకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞ వేషధారణలతో రామాయణం విశిష్టత తెలియజేస్తూ కళ్యాణ తీరును నిర్వహించారు.

ఇవాళ సీతారాముల కల్యాణం నిర్వహించాం. రేపు పట్టాభిషేకం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భద్రాద్రి తరువాత జిల్లాలోనే కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. రేపటి వేడుకకు కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలి.- కల్యాణం నిర్వహించిన పూజారి

దర్గాలో దశరథ కుమారుడి కళ్యాణం... రేపు పట్టాభిషేకానికి ఏర్పాట్లు

ఇదీ చూడండి: వాడవాడలా వైభవంగా సీతారాముల పెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.