భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్లు... ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. మూడు రోజులుగా దుబ్బగూడెం, దేవుళ్లగూడెం, గంగారం ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు.
తెల్లవారుజామున 4గంటలకు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారన్న ఆయన... వారిని వెంబడించగా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్లు స్పష్టం చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి