Singareni Strike: సింగరేణి కాలరీస్‌లో సమ్మె సైరన్ మోగింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల సమ్మె నోటీసిచ్చారు. టీబీజీకేఎస్, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ నేతలు సమ్మె నోటీసు అందించారు. దీనిపై హైదరాబాద్ ఆర్ఎల్సీ కార్యాలయంలో సింగరేణి సంఘాల నాయకులతో ప్రాంతీయ లేబర్ కమిషనర్ చర్చలు నిర్వహించారు. సమ్మె నోటీస్‌పై చర్చించారు.
ఈ సందర్భంగా పలు కీలక డిమాండ్లను కార్మిక సంఘాల నేతలు అధికారుల ఎదుట ఉంచారు. కేంద్రం 4 బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని టీబీజీకేఎస్ నేత రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాల విషయంలో యాజమాన్యం స్పష్టత ఇవ్వాలన్నారు. కార్మికులకు సంబంధించిన మరికొన్ని అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచూడండి: TS High court :'డబుల్' ఇళ్ల కేటాయింపులో వాళ్లకు కూడా కేటాయించండి