భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని జేకే5 ఉపరితల బొగ్గు గని ప్రాంతంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని బొగ్గు గనులప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 2, 3, 4 తేదీల్లో 72 గంటల పాటు జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొనాలని జేఏసీ నాయకులు కోరారు. కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా, సమావేశాలు జరుపుకోకుండా అధికారులు భయాందోళనకు గురి చేస్తున్నారని నాయకులు ఆరోపించారు.
ఉపరితల బొగ్గు కార్మికులు తమ ఉద్యోగాల భద్రత కోసం సమ్మెలో పాల్గొనాలని ఏఐటీయూసీ నాయకులు సారయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణతో ఉద్యోగ భద్రతను హరించి వేస్తుంటే.. కార్మికులు భయాందోళనతో ఉంటే ఏం లాభం లేదన్నారు. కార్మికుల ఆందోళనకు అధికారుల తీరే కారణమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ నాయకులు పాల్గొన్నారు
ఇవీ చూడండి: టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుల పరిస్థితి దయనీయం